కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతం

ABN , First Publish Date - 2021-01-19T04:31:46+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతం

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతం
వెంకటాపూర్‌లో టీకా వేసే విధానాన్ని పరిశీలిస్తున్న జగదీశ్‌

వెంకటాపూర్‌(రామప్ప), జనవరి 18: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విజయవంతమైంది. జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌ స్థానిక జడ్పీటీసీ గై రుద్రమదేవిఅశోక్‌, ఎంపీపీ బుర్ర రజితసమ్మయ్యతో కలిసి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ అల్లెం అప్పయ్య, జిల్లా ఇమ్యునైజేషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్యాంసుందర్‌ వెంకటాపూర్‌ పీహెచ్‌సీని సందర్శించి వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షించారు. కొంతమంది ఉద్యోగులు గుండెజబ్బు సమస్య ఉందని డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లగా తానే స్వయంగా వ్యాక్సిన్‌ వేసి అరగంట పాటు పరిశీలించారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ తమకు నిర్ధేశించిన తేదీలలో తప్పకుండా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని డీఎంహెచ్‌వో సూచించారు. అనంతరం వైద్యాధికారులు 39 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు పోశాల అనిత, జంగిలి శ్రీలత, సర్పంచ్‌ మేడబోయిన అశోక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కూరెళ్ల రామాచారి, ఎంపీడీవో కర్నాటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ వాజేడు : మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను సోమవారం ప్రారంభించారు. ఎంపీపీ శ్యామల శారద, జడ్పీటీసీ తల్లడి పుష్పలత, వైద్యాధికారి యమున సెంటర్‌ను ప్రారంభించగా, కరోనా టీకాను మొదట పూసూరుకు చెందిన ఆశా కార్యకర్త దేవికి వేశారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో మంకిడి వెంకటేశ్వరరావు సైతం టీకా వేయించుకున్నారు. వాజేడులో తొలిరోజు 37 మందికి టీకా వేసినట్లు వైద్యాధికారి యమున తెలిపారు.

Updated Date - 2021-01-19T04:31:46+05:30 IST