జీవీఎంసీలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

ABN , First Publish Date - 2021-06-20T17:30:08+05:30 IST

జీవీఎంసీలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలోని 578 వార్డు సచివాలయాలలో వ్యాక్సినేషన్‌ ఇస్తున్నారు.

జీవీఎంసీలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

విశాఖపట్నం: జీవీఎంసీలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జీవీఎంసీ పరిధిలోని 578వ వార్డు సచివాలయాలలో వ్యాక్సినేషన్‌ ఇస్తున్నారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఐదేళ్ల లోపు చిన్నారుల తల్లులకు టీకా ఇవ్వనున్నారు. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డును నెలకొల్పే దిశగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా నేడు ‘వ్యాక్సినేషన్ సండే’ పేరిట సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టి గరిష్ఠ స్థాయిలో ప్రజలకు టీకా డోసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఒక్క రోజులోనే 8 నుంచి 10 లక్షల డోసులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ముందస్తుగా 14 లక్షల డోసుల వ్యాక్సిన్లను వివిధ జిల్లాల్లో సిద్ధం చేశారు. వ్యాక్సినేషన్‌లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-06-20T17:30:08+05:30 IST