ప్రభుత్వ రేషన్ దుకాణాల లబ్ధిదారులకు Covid టీకా తప్పనిసరి

ABN , First Publish Date - 2021-11-13T18:11:02+05:30 IST

ప్రభుత్వ రేషన్ దుకాణాల లబ్ధిదారులకు కొవిడ్ టీకాలు తప్పనిసరి చేస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది....

ప్రభుత్వ రేషన్ దుకాణాల లబ్ధిదారులకు Covid టీకా తప్పనిసరి

భోపాల్: ప్రభుత్వ రేషన్ దుకాణాల లబ్ధిదారులకు కొవిడ్ టీకాలు తప్పనిసరి చేస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి రాష్ట్రంలో 100 శాతం కొవిడ్-19 వ్యాక్సినేషన్ సాధించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం వివిధ పద్ధతులను ఉపయోగిస్తోంది. తాజా చర్యలో భాగంగా  రాష్ట్ర ఆహార,పౌర సరఫరాల శాఖ నిర్వహించే చౌక ధరల దుకాణాలలో రాయితీపై లేదా ఉచితంగా ఆహార ధాన్యాలు రెండు డోసుల టీకాలు తీసుకున్న వారికి మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.టీకాలు వేయించుకోని వారు సమీపంలోని టీకా కేంద్రం నుంచి టీకాలు వేసుకోవడానికి అంగీకరిస్తేనే రేషన్ ఇస్తామని సర్కారు తెలిపింది. 


చౌక ధరల దుకాణాలకు వచ్చే ప్రతి లబ్ధిదారుడి టీకా స్థితిని ఆరా తీయాలని రేషన్ షాపుల ఉద్యోగులను కోరింది.రేషన్ లబ్ధిదారుల పేర్లు, వారు టీకా వేయించుకున్న తేదీలను నమోదు చేసుకోవాలని సర్కారు ఆదేశించింది. ఒక డోస్ టీకా తీసుకున్న వారికి రెండో డోస్ వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు వారి ఇళ్లకు ఆరోగ్యకార్యకర్తలను పంపిస్తామని పౌర సరఫరాల శాఖ అధికారి చెప్పారు. అర్హులైన వారందరికీ టీకాలు వేయడానికి డిసెంబర్ 31 వరకు శివరాజ్ ప్రభుత్వం గడువు విధించింది.


Updated Date - 2021-11-13T18:11:02+05:30 IST