దేశంలో 153.80 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-12T20:32:19+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పెద్దయెత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది.

దేశంలో 153.80 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పెద్దయెత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఈ మేరకు బుధవారం నాటికి దేశంలో 153.80 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 85 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 96.01 శాతం కాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 1,94,720 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,55,319 కాగా పాజిటివిటీ రేట్ 9.82శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-12T20:32:19+05:30 IST