దేశంలో 149.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-07T21:20:33+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది.

దేశంలో 149.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 149.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 94లక్షల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో రికవరీ రేట్ 97.57 శాతం కాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 1,17,100 కేసులు నమోదయినట్టు అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363 కాగా, వీక్లీ పాజిటివ్ రేట్ 4.54 శాతంగా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-01-07T21:20:33+05:30 IST