దేశంలో 145.44 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2022-01-02T20:43:49+05:30 IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు దేశంలోని అర్హులందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టింది

దేశంలో 145.44 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాప్తి నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు దేశంలోని అర్హులందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేపట్టింది. ఆదివారం నాటికి దేశంలో 145.44 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడిచిన 24గంటల్లో 25 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.27 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,553 కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేట్ 1.35శాతంగా పేర్కొన్నారు. ఇప్పటి వరకూ రికవరీ అయిన వారు 3,42,84,561 గా అధికారులు తెలిపారు. 


Updated Date - 2022-01-02T20:43:49+05:30 IST