దేశంలో 143.83 కోట్ల కోవిడ్ వ్యక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-30T23:27:44+05:30 IST

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ ముమ్మరంగా జరుగుతోంది.

దేశంలో 143.83 కోట్ల కోవిడ్ వ్యక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ ముమ్మరంగా జరుగుతోంది. ఇప్పటి వరకూ 143.83 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గడిచిన 24 గంటల్లో 63 లక్షల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.38 శాతంగా అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,154 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 82,402 కాగా గడిచిన 46 రోజుల్లో వీక్లీ పాజిట్ రేట్ 1శాతం(0.76 శాతం)గా అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-30T23:27:44+05:30 IST