దేశంలో 143.15 కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-29T20:44:51+05:30 IST

దేశంలో కోవిడ్ నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది

దేశంలో 143.15 కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే అర్హత గల ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. ఈమేరకు ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 143,15 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 64లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.40 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,195 కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 77,002 కాగా గడిచిన 45 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం(0.68శాతం)గా అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-29T20:44:51+05:30 IST