దేశంలో 139.70 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

ABN , First Publish Date - 2021-12-23T21:34:35+05:30 IST

దేశంలో కోవిడ్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది

దేశంలో 139.70 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసుల పంపిణీ

హైదరాబాద్: దేశంలో కోవిడ్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది.ముఖ్యంగా ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను మరింత ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 139.70 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోస్ లను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


గడిచిన 24 గంటల్లో 70 లక్షల రోవిడ్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో రికవరీ రేట్ 98.40 శాతం కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,495 కేసులు నమోదైనట్టు తెలిపారు.ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 78,291 కాగా గడిచిన 39 రోజుల్లో వీక్లీ పాజిటివ్ రేట్ 1శాతం (0.59శాతం)గా అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-12-23T21:34:35+05:30 IST