పగిలిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ వైల్స్‌

ABN , First Publish Date - 2021-01-19T07:05:45+05:30 IST

పిఠాపురం మండలం విరవ పీహెచ్‌సీలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వైల్స్‌ పగిలిపోయాయి. ఈ వ్యవహారంపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు.

పగిలిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ వైల్స్‌
విరవ పీహెచ్‌సీలో పగిలిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ వైల్స్‌

విరవ పీహెచ్‌సీలో ఘటన

ఉన్నతాధికారులు సీరియస్‌

విచారణ చేపట్టిన పోలీసులు

పిఠాపురం రూరల్‌, జనవరి 18: పిఠాపురం మండలం విరవ పీహెచ్‌సీలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వైల్స్‌ పగిలిపోయాయి. ఈ వ్యవహారంపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. పోలీసులు విచారణ చేపట్టారు... వివరాలు ఇలా వున్నాయి... కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా పిఠాపురం ప్రభుత్వాసుపత్రి నుంచి ఆరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వైల్స్‌ను విరవ పీహెచ్‌సీకి హెల్త్‌ సూపర్‌వైజర్‌, పోలీసు కానిస్టేబుల్‌ సోమవారం తీసుకువెళ్లారు. అక్కడకు వెళ్లిన గంటన్నర తర్వాత ఆరు వైల్స్‌లో మూడు పగిలిపోయినట్టు గుర్తించారు. ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినా రాత్రి వెలుగుచూసింది. దీనిపై వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. బాధ్యులు ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. పిఠాపురం రూరల్‌ ఎస్‌ఐ పార్థసారధి విచారణ చేపట్టారు. తీసుకువెళ్లిన సిబ్బంది నిర్లక్ష్యమా, రవాణాలో పగిలిపోయాయా తదితర కోణాల్లో విచారణ సాగుతోంది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమైన మూడో రోజునే ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది.  కాగా వ్యాక్సిన్‌ను హెల్త్‌ సూపర్‌వైజర్‌  తీసుకువస్తుండగా మార్గమధ్యంలో బైక్‌ ప్రమాదానికి గురవ డంతో కింద పడిపోయిందని, ఈ సమయంలో వ్యాక్సిన్‌ సీసా పగిలిపోయిందని విరవ పీహెచ్‌సీ వైద్యాధికారి డీఎంహెచ్‌వో కు నివేదిక పంపారు. 


Updated Date - 2021-01-19T07:05:45+05:30 IST