కర్నూలు: జీజీహెచ్ ఆస్పత్రిలో కరోనా రోగుల అవస్థలు

ABN , First Publish Date - 2021-05-13T20:41:10+05:30 IST

కర్నూలు: జీజీహెచ్ ఆస్పత్రిలో కరోనా రోగులు తీవ్ర అవస్థలుపడుతున్నారు.

కర్నూలు: జీజీహెచ్ ఆస్పత్రిలో కరోనా రోగుల అవస్థలు

కర్నూలు: జీజీహెచ్ ఆస్పత్రిలో కరోనా రోగులు తీవ్ర అవస్థలుపడుతున్నారు. ఓల్డు గైనిక్ విభాగంలో బెడ్లు లేక నేలపై పడుకోబెట్టి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరి రెండు రోజులైనా సిబ్బంది బెడ్లు కేటాయించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంజక్షన్లు తప్ప మందులు, ఆహారం సరిగా ఇవ్వడంలేదని ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన కోవిడ్ రోగికి మూడు గంటల లోపల బెడ్లు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ మూడు రోజులు కావస్తున్నా కొంతమంది రోగులకు బెడ్స్ ఇవ్వడంలేదంటే.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మరోవైపు ఆస్పత్రి అధికారులు మాత్రం రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని గొప్పలు చెప్పడం కొసమెరుపు. వైద్య సిబ్బంది తీరుపై కరోనా రోగులు, వారి బంధువులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Updated Date - 2021-05-13T20:41:10+05:30 IST