కొవిడ్‌ బాధితులకు వైద్యం ఉచితం

ABN , First Publish Date - 2021-04-19T05:16:10+05:30 IST

కొవిడ్‌ బాధితులకు వైద్యం పూర్తి ఉచితమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.

కొవిడ్‌ బాధితులకు వైద్యం ఉచితం
ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో చర్చిస్తున్న మంత్రి నాని

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 18:కొవిడ్‌ బాధితులకు వైద్యం పూర్తి ఉచితమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఏలూరు క్యాంప్‌ కార్యాలయంలో ఎంపీ కోటగిరి శ్రీధర్‌తో చర్చించిన తర్వాత ఆయన మాట్లాడారు. కరోనా బాధి తులు ఎవరికైనా హోం ఐసొలేషన్‌లో ప్రత్యేక గది లేక పోతే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో వైద్యాధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. ఐసొలే షన్‌లో వున్న బాధితులకు తక్షణం మెడికల్‌ కిట్‌లు అందించాలని, బాధితులకు రోజూ వైద్యుల పర్యవేక్షణ చేస్తారన్నారు. కరోనా పేషెంట్‌లకు ఫోన్‌ చేసిన మూడు గంటల్లో బెడ్‌లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు నాణ్యమైన ఆహారం, శానిటేషన్‌ విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించినట్టు వెల్లడించారు. 


Updated Date - 2021-04-19T05:16:10+05:30 IST