అనుమతి లేకుండా కొవిడ్‌ రోగులకు చికిత్స

ABN , First Publish Date - 2021-05-14T05:49:15+05:30 IST

పట్టణం లోని అంజిరెడ్డి హాస్పిట ల్‌లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికా రులు గురువారం తనిఖీ లు నిర్వహించారు.

అనుమతి లేకుండా కొవిడ్‌ రోగులకు చికిత్స
ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

నరసరావుపేట లీగ ల్‌, మే 13 : పట్టణం లోని అంజిరెడ్డి హాస్పిట ల్‌లో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికా రులు గురువారం తనిఖీ లు నిర్వహించారు. నాదెండ్ల మండలం కన పర్రు గ్రామానికి చెందిన ముల్లా ప్రతీప్‌ కొవిడ్‌తో అంజిరెడ్డి ఆసుపత్రిలో చేరారు. ఐదు రోజుల చికిత్సకు రూ.3,38,300, అదనంగా రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లకు వసూలు చేసినట్టు రుజువైంది. అసుపత్రికి కొవిడ్‌ చికిత్సకు అనుమతి లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి జాషువా అన్నారు. ఇదే అసుపత్రిపై పిడుగురాళ్లలో అఽధిక చార్జిలు వసూలు చేస్తున్నట్లు నిర్దారణ కావడంతో ఈనెల 5వ తేదీన కేసు నమోదు చేశామన్నారు. తదుపరి చర్యలకు సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తామన్నారు.


Updated Date - 2021-05-14T05:49:15+05:30 IST