కాణిపాక ఆలయ సిబ్బందికి కరోనా

ABN , First Publish Date - 2021-04-17T06:03:51+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పనిచేసే అర్చకులకు, వాహనాలకు పూజ చేసే చోట పని చేసే భజంత్రీలకు కరోనా సోకింది.

కాణిపాక ఆలయ సిబ్బందికి కరోనా

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్‌ 16: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో పనిచేసే అర్చకులకు, వాహనాలకు పూజ చేసే చోట పని చేసే భజంత్రీలకు కరోనా సోకింది. ఇద్దరు అర్చకులు, ముగ్గురు భజంత్రీలు వైరస్‌ బారినపడ్డారు. దీనిపై ఆలయానికి వచ్చే భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆలయ సిబ్బందికి  రెండో దఫా కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. 


Updated Date - 2021-04-17T06:03:51+05:30 IST