Covid మూడో దశపై మంత్రి ఏమన్నారో తెలిస్తే...

ABN , First Publish Date - 2021-10-27T17:20:43+05:30 IST

మనదేశంలోనూ కొత్త వైర్‌సను గుర్తించి న తరుణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. మంగళవారం హుబ్బళ్ళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటన్‌ రష్యాలలో

Covid మూడో దశపై మంత్రి ఏమన్నారో తెలిస్తే...

- కొత్త వైరస్‌పై అప్రమత్తం

- నిపుణులతో చర్చించి చర్యలు  

- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ 


బెంగళూరు(Karnataka): మనదేశంలోనూ కొత్త వైరస్‌ను గుర్తించిన తరుణంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ వెల్లడించారు. మంగళవారం హుబ్బళ్ళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటన్‌ రష్యాలలో వైరస్‌ ప్రభావం చూపిందని, మనదేశంలోనూ కొత్త వైర్‌సను గుర్తించడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. కరోనాలో భాగంగా ఏవై 4.2 వైరస్‌ ఏ ప్రభావం చూపుతుందనేది నిపుణులతో చర్చించి రాష్ట్రంలో చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని కొవిడ్‌ కేసులలో కొత్త వేరియంట్‌లు ఉండవచ్చుననే అనుమానం ఉందని, ఇందుకోసం జనోమిక్స్‌ సీక్వెన్స్‌ టెస్టింగ్‌లకు పంపామన్నారు. నివేదికలు వచ్చాక రాష్ట్రంలో కొ త్త వైరస్‌ వచ్చిందా? లేదా? అనేది తేలనుందన్నారు. రాష్ట్రంలో కొన్ని నెలల క్రితమే కొత్త వైరస్‌ పట్ల నిఘా పెట్టామని, రాష్ట్రంలోని ఆరేడు ప్రాంతాలలో జినోమిక్స్‌ సీక్వెన్స్‌ ల్యాబ్‌లు తెరిచామన్నారు. కొత్త వైర్‌సపై వైద్య నిపుణులతో తరచూ చర్చిస్తున్నామన్నారు. కొన్ని గంటల ముందే కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌తో వీడియో సమావేశం నిర్వహించామన్నారు. కొత్త వైరస్‌ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇంకా స్పష్టత లేదన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. 


మూడో విడత వైరస్‌ ప్రబలవచ్చు...

బ్రిటన్‌, రష్యాతోపాటు పలు దేశాలలో కొవిడ్‌ మూడో విడత ప్రారంభమైన తరుణంలో రాష్ట్రంలోనూ ప్రబలవచ్చునని మంత్రి సుధాకర్‌ అన్నారు. అయితే సాధ్యం కాదని చెప్పలేమన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నవారిపై పెను ప్రభావం ఉండకపోవచ్చునని, ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ముందు జాగ్రత్తగా కొవిడ్‌ నియమాలు పాటించాల్సిందేనన్నారు. మూడో విడత వైరస్‌ ప్రబలితే ఏ విధంగా ఎదుర్కొనాలనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, అంతమాత్రాన నిర్లక్ష్యం సరికాదన్నారు. వ్యాక్సిన్‌ తీసుకోకుంటే ప్రమాదం తీవ్రమేనన్నారు. బెంగళూరు పా లికె పరిధిలో మరిన్ని చర్యలు అమలు చేయదలిచామన్నారు. మూడో విడత వచ్చినా, రాకున్నా నియంత్రణా చర్యలు పాటించాల్సిందేనన్నారు. 



Updated Date - 2021-10-27T17:20:43+05:30 IST