high alert: ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-02T14:20:36+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది....

high alert: ఉత్తరాఖండ్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

డెహ్రాడూన్(ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. థర్డ్ వేవ్ కరోనా ప్రబలుతుందనే వార్తలతో అప్రమత్తమైన ఉత్తరాఖండ్ సర్కారు హైఅలర్ట్ ప్రకటించింది. వారంరోజుల్లో 240 కరోనా కేసుల నుంచి రెట్టింపు అయి 466 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.ఇప్పటికే కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడివశా, అసోం, మహారాష్ట్ర, మేఘాలయ, మణిపూర్, మిజోరంతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళన కలిగిస్తోంది.


 ఉత్తరాఖండ్ లో సోమవారం 632 కేసులు నమోదైనాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వ్యాప్తి చెందుతుండటంతో ఛార్‌ధాం యాత్రతోపాటు పర్యాటకుల సందర్శనలను నిలిపివేయాలని హైకోర్టు సర్కారును కోరింది.నైనిటాల్ ప్రాంతంలో 75 శాతం సందర్శకులు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదని, దీనివల్లనే కరోనా కేసుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.


Updated Date - 2021-08-02T14:20:36+05:30 IST