మా టెస్టింగ్ కిట్‌తో కోవిడ్-19 పరీక్షా ఫలితాలు ఓ గంటలోనే : మోల్బియో డయాగ్నొస్టిక్స్

ABN , First Publish Date - 2020-04-10T03:48:23+05:30 IST

నిర్థరణ పరీక్షల కోసం సమర్థవంతమైన టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధిపరిచామని

మా టెస్టింగ్ కిట్‌తో కోవిడ్-19 పరీక్షా ఫలితాలు ఓ గంటలోనే : మోల్బియో డయాగ్నొస్టిక్స్

న్యూఢిల్లీ : కోవిడ్-19 నిర్థరణ పరీక్షల కోసం సమర్థవంతమైన టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధిపరిచామని, దీనికి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి లభించిందని మోల్బియో డయాగ్నొస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. 


తాము తయారు చేసిన టెస్టింగ్ కిట్‌ను ఉపయోగించి కోవిడ్ -19 అనుమానితులను పరీక్షిస్తే, కేవలం ఓ గంటలోనే ఫలితాలు వెల్లడవుతాయని తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న పరీక్షా విధానాల్లో ఫలితాల వెల్లడికి ఒక రోజు కన్నా ఎక్కువ సమయం పడుతోందని తెలిపింది. 


మోల్బియో డయాగ్నొస్టిక్స్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ నాయర్ మాట్లాడుతూ ఈ పరికరాన్ని ఇప్పటికే టీబీ కేసుల పరీక్షల కోసం ఆంధ్ర ప్రదేశ్, గోవాలలో ఉపయోగిస్తున్నారని తెలిపారు. దీనిని కోవిడ్-19 నిర్థరణ పరీక్షల కోసం కూడా వినియోగించవచ్చునని చెప్పారు. తాము కర్ణాటక ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరుపుతున్నామని, అనుమతి లభిస్తే, ఆ రాష్ట్రంలో కూడా ఈ టెస్టింగ్ కిట్‌తో పరీక్షలు నిర్వహించవచ్చునని తెలిపారు.


Updated Date - 2020-04-10T03:48:23+05:30 IST