కొవిడ్‌ టెర్రర్‌

ABN , First Publish Date - 2021-04-10T06:21:33+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ కొత్త కేసులు 78 నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,25,665కు చేరింది.

కొవిడ్‌ టెర్రర్‌
బొమ్మూరు టిడ్కో గృహాల వద్ద ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న జేసీ కీర్తి

  • బొమ్మూరు టిడ్కో గృహాల్లో మళ్లీ కొవిడ్‌ క్వారంటైన్‌ సెంటర్‌
  • జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు

జిల్లాలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొవిడ్‌ కొత్త కేసులు 78 నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,25,665కు చేరింది. దీంతో జిల్లా యంత్రాంగం మళ్లీ క్వారంటైన్‌ సెంటర్లు, కొవిడ్‌ వైద్యంపై దృష్టిపెట్టింది. గతంలో అతి పెద్ద క్వారంటైన్‌ సెంటర్‌గా ఉన్న బొమ్మూరు  టిడ్కో గృహాల్లో ఉంచే విధంగా ఆలోచన చేస్తోంది.

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 78 కేసులు నమోదుకాగా, జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,25,665కి చేరింది. ఈ నేపథ్యంలో బొమ్మూరు టిడ్కో హౌసింగ్‌లో మళ్లీ కొవిడ్‌ క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 1000 పడకలతో ఇక్కడ కొవిడ్‌ బాధితులకు వైద్యం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజుల్లో ఇది సిద్ధం కానున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌లో ఇటీవల మళ్లీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకూ వైద్యాధికారులు 32 వేల కరోనా టెస్ట్‌లు చేశారు. అందులో  1350 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అందులో రాజమహేంద్రవరం సిటీ పరిధిలోనే 840 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో 510 మంది ఉన్నారు. ప్రస్తుతం సిటీలో 189 పాజిటివ్‌ కేసులు ఉం డగా రూరల్‌లో 113 ఉన్నాయి. అందరినీ హోంక్వారంటైన్‌లో ఉం చుతున్నారు. సీరియస్‌గా ఉంటే ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ఈనేపథ్యంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా బొమ్మూరు టిడ్కో గృహాలను సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి బొమ్మూరు వేలాది ఇళ్లు నిర్మించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గృహ ప్రవేశాలకు ముహూర్తాలు పెట్టారు. ఎన్నికల వల్ల ఆగాయి. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక, చాలాకాలం వీటిని పట్టించుకోలేదు. తర్వాత కొవిడ్‌ వల్ల ఇది ప్రధాన క్వారంటైన్‌ సెంటర్‌గా మారడంతో అక్కడే వైద్యం చేశారు. కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇక్కడ సెంటర్‌ ఖాళీ చేశారు. కానీ శుభ్రం చేయలేదు. ఇటీవల వైసీపీ లబ్ధిదార్లకు పట్టాలు ఇచ్చింది. మౌలిక సదుపాయ లు పూర్తయిన తర్వాత లబ్ధిదార్లకు గృహ ప్రవేశాలు ఉంటాయని భావించారు. ఈలోగా కోవిడ్‌ మళ్లీ విజృంభిస్తుండడంతో ఈ గృహాలను క్వారంటైన్‌ సెంటర్లుగా మార్చే ఏర్పాట్లు మొదలెట్టారు.

  • బొమ్మూరులో జేసీ కీర్తి ఏర్పాట్ల పరిశీలన

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 9: కొవిడ్‌ రెండో దశలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో బొమ్మూరు టిడ్కో గృహాల్లో గతంలో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో బాధితులకు చికిత్స అందించేందుకు వీలుగా వాటిని సిద్ధం చేస్తున్నామని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కీర్తి చేకూరి చెప్పారు. శుక్రవారం రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ అనుపమ అంజలితో కలిసి బొమ్మూరులోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను సందర్శించారు. అక్కడి అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ఈ సం దర్భంగా జేసీ మాట్లాడుతూ కొవిడ్‌ బాధితు లకు గతంలో మాదిరిగానే బొమ్మూరు కేంద్రం లో ఆశ్రయం కల్పించి చికిత్సలు చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. పెండింగ్‌ విద్యుత్‌ ఛార్జీల బిల్లులు, 10 బ్లాకులకు రన్నింగ్‌ వాటర్‌ అందించడం వంటి వాటిపై సమీక్షిస్తూ మూడు మోటార్లు రిపేరు చేయించి రన్నింగ్‌ కండీషన్‌లో పెట్టాలని చెప్పారు. బాధితులకు పరుపులతో మంచాలు ఏర్పాటు, ఫ్యాన్లు, బకె ట్లు, మగ్గులు, నిరంతర విద్యుత్‌ సరఫరా వం టివి ఏర్పాటు చేయాలని, పారిశుధ్యం, డ్రైనేజీ సౌకర్యం, కల్పించాలని జేసీ చెప్పారు. మరుగు దొడ్ల ట్యాప్‌లు, గేట్‌ వాల్వులు కొంతకాలంగా వాడక మురుగు పేరుకుందని, దాన్ని శుభ్రం చేయాలన్నారు. ప్రతీ బ్లాకులో ఉన్న 32 గదు ల్లో గదికి ఐదుగురు చొప్పున 160 మంది చికి త్స పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. కొవిడ్‌ బాధితులకు గతంలో మాదిరిగానే పర్యాటక శాఖ ఆహారం సరఫరా చేయించాలన్నారు. ఎం హెచ్‌వో వినూత్న, ఈఈ పాండురంగారావు, డీఈ ప్రసాదరావు, డిప్యూటీ డీఎంఅండ్‌ హెచ్‌ వో కోమల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-10T06:21:33+05:30 IST