ఆలయాల్లో కొవిడ్‌ నిబంధనలు

ABN , First Publish Date - 2021-05-06T05:39:34+05:30 IST

నంద్యాలలోని ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం, మూలమఠంలోని భీమలింగేశ్వరాలయం, మూలసాగరంలోని రామస్వామి దేవస్థానం, కాశీవిశ్వేశ్వర దేవస్థానం, క్రిష్ణనందిలోని విష్ణునందీశ్వర దేవస్థానం లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ నియమ నిబంధనలు పాటిస్తున్నారు.

ఆలయాల్లో కొవిడ్‌ నిబంధనలు

  1. సాయంత్రం దైవ దర్శనం రద్దు


నంద్యాల(కల్చరల్‌), మే 5: నంద్యాలలోని ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం, మూలమఠంలోని భీమలింగేశ్వరాలయం, మూలసాగరంలోని రామస్వామి దేవస్థానం, కాశీవిశ్వేశ్వర దేవస్థానం, క్రిష్ణనందిలోని విష్ణునందీశ్వర దేవస్థానం లో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ నియమ నిబంధనలు పాటిస్తున్నారు. బుధవారం నుంచి ఈనెల 20వ తేదీ వరకు పట్టణంలో కర్ఫ్యూ విధించినందు వల్ల ఉదయం 6 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే భక్తులకు ఆలయంలోకి అనుమతి ఇస్తారని గ్రూప్‌ టెంపుల్స్‌ ఈవో రామాంజనేయ శర్మ తెలిపారు. సాయంత్రం పూజాది కార్యక్రమాలు అర్చకుల ద్వారా నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2021-05-06T05:39:34+05:30 IST