నిరంతర సేవలతో కొవిడ్‌ బాధితులకు భరోసా

ABN , First Publish Date - 2021-06-18T04:23:49+05:30 IST

కరోనా లాక్‌ డౌన్‌తో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న పేదలకు నిరంతరం సేవలందిస్తూ వారికి మనో ధైర్యాన్ని అందిస్తూ సహాయక కేంద్రం లక్ష్యాలను నెరవేరుస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబిర్‌పాషా తెలిపారు.

నిరంతర సేవలతో కొవిడ్‌ బాధితులకు భరోసా

కొత్తగూడెం సంక్షేమం, జూన్‌ 17: కరోనా లాక్‌ డౌన్‌తో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న పేదలకు నిరంతరం సేవలందిస్తూ వారికి మనో ధైర్యాన్ని అందిస్తూ సహాయక కేంద్రం లక్ష్యాలను నెరవేరుస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబిర్‌పాషా తెలిపారు. 12వ రోజైన గురువారం శేషగిరి భవన్‌లోని యూనియన్‌ కొమరయ్య కోవిడ్‌ సహాయక కేంద్రంలో హోం క్వారంటైన్‌, ఐసోలేషన్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 180 రోగులకు, సహాయకు లకు గుడ్లు, ఆకు కూరలతో కూడిన పౌష్టికాహారాన్ని సేవ స భ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సాబిర్‌పాషా మా ట్లాడుతూ.... 12 రోజులుగా కొవిడ్‌ బాధిత కుటుంబాల ఆకలి తీరుస్తున్నామని, ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలను ని త్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. అత్యవసర పరిస్థితులు ఉన్న పేద కుటుంబాలకు మందులు, ఆక్సిజన్‌ను ఏర్పాటు చేస్తు న్నామని తెలిపారు. 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ ఎవ రికీ ఏ అవసరాలు వచ్చినా క్షేత్ర స్థాయిలో పరిష్కరించేందుకు సేవా సభ్యులు అందుబాటులో ఉం టున్నారన్నారు. టీఎన్‌ఆర్‌ ట్రస్టు చైర్మన్‌ తాండ్ర వెంకటేశ్వరరావు సహకారంతో బాధితు లకు భోజనం పంపిణీ నిరంతరాయంగా జరుగుతుందని అన్నారు. 

 రూ.లక్ష విరాళం అందించిన భరత్‌, క్రాంతి

కొవిడ్‌ బాధితులకు అనునిత్యం సేవలందిస్తున్న యూనియన్‌ కొమరయ్య కొవిడ్‌ సహాయక కేంద్రానికి కొత్త గూడెం మాజీ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు కుమారుడు కూనంనేని భరత్‌ రూ.50వేలు, కుమార్తె కూనంనేని క్రాంతి రూ.50వేలు విరాళాన్ని అందజేశారు. పోస్టు ద్వారా గురువారం కొవిడ్‌ సహాయక కేంద్రానికి చేరుకున్న రూ.లక్ష విరాళం చెక్కును సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే. సాబీ ర్‌పాషా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కరోనా బాధితులకు తాము అందిస్తున్న సేవలకు అనూహ్య స్పందన లభిస్తోందని, విరాళాల ద్వారా దాతలు తాము అందిస్తున్న సేవలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు వెనుకాడబోమని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు గని గళ్ల వీరస్వామి, కంచర్ల జమలయ్య, సేవా సభ్యులు మంద నిర్మల, కె.రత్నకు మారి, పిట్టల రాంచందర్‌, షేక్‌ జాహెద్‌, ఎంపీటీసీ నూనావత్‌ గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T04:23:49+05:30 IST