Second Doseకు కోటిమంది దూరం

ABN , First Publish Date - 2022-01-23T13:22:56+05:30 IST

రాష్ట్రంలో కోటిమందికి పైగా రెండో విడత వ్యాక్సిన్‌ వేసుకోలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలి పారు. చెన్నైలో శనివారం ఉదయం 19వ విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించారు.

Second Doseకు కోటిమంది దూరం

                                        - మంత్రి సుబ్రమణ్యం


చెన్నై: రాష్ట్రంలో కోటిమందికి పైగా రెండో విడత వ్యాక్సిన్‌ వేసుకోలేదని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలి పారు. చెన్నైలో శనివారం ఉదయం  19వ విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఆయన ప్రారంభించారు. నగరంలోని ఐఐటీ మద్రాసు క్యాంపస్‌లో ఏర్పాటైన వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 3.32 కోట్ల మందికి టీకాలు వేశామని తెలిపారు. మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో సెకండ్‌ డోస్‌ టీకాలు, 15 నుంచి 18యేళ్లలోపు బాలబాలికలు టీకాలు వేసుకోవచ్చునని చెప్పారు. సీనియర్‌ సిటిజన్లకు బూస్టర్‌ డోస్‌ కూడా మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో వేస్తున్నామని ఆయన వివరించారు. నగరంలో 94 శాతం మంది మొదటి విడత టీకాలు, 74 శాతం మంది రెండో విడత టీకాలు వేసుకున్నారని, వైద్య శాఖ అధికారుల పరిశీలన మేరకు రాష్ట్రంలో కోటిమందికి పైగా రెండోవిడత టీకాలు వేసుకోలేదని, వారంతా త్వరగా టీకాలు వేసుకోవాలని చెప్పారు. మంత్రి తోపాటు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జే. రాధాకృష్ణన్‌, మద్రాసు ఐఐటీ డైరెక్టర్‌ కామకోడి, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్లు సిమ్రన్‌ జిత్‌, మనీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T13:22:56+05:30 IST