ముంబై-గోవా cruise shipలో కలకలం..క్రూ మెంబరుకు కొవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-03T12:52:27+05:30 IST

ముంబై నుంచి గోవాకు బయలుదేరిన కార్డెలియా క్రూయిజ్ షిప్‌లోని ఓ క్రూ మెంబర్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది....

ముంబై-గోవా cruise shipలో కలకలం..క్రూ మెంబరుకు కొవిడ్ పాజిటివ్

ముంబై:  ముంబై నుంచి గోవాకు బయలుదేరిన కార్డెలియా క్రూయిజ్ షిప్‌లోని ఓ క్రూ మెంబర్‌కి కరోనా పాజిటివ్ అని తేలింది. క్రూయిజ్ షిప్‌లో 2వేల మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు.దీంతో విహారనౌకలో కలకలం నెలకొంది. దీంతో విహార నౌకలోని ప్రయాణీకులు,సిబ్బందికి కొవిడ్ -19 పరీక్షలు చేశారు. కొవిడ్ సోకిన సిబ్బందిని ఓడలో ఐసోలేషన్‌ గదికి తరలించారు. పీపీఈ కిట్‌లు వేసుకొని వైద్యుల బృందం 2016 మంది ప్రయాణికులు, సిబ్బందికి ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలు చేశారు. కరోనా పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదు. 


కరోనా పరీక్షా ఫలితాలు వెలువడేలోపు ఎవరూ ఓడ నుంచి దిగవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. క్రూయిజ్ షిప్‌ను మార్ము గోవా క్రూయిజ్ టెర్మినల్ సమీపంలో నిలిపివేశారు. విహారనౌకలో ఒకరికి కరోనా సోకడంతో గోవా నౌకాశ్రయంలో నిలిపివేసేందుకు ముంబై పోర్ట్ ట్రస్ట్ అనుమతించలేదు. క్రూయిజ్ షిప్ లో కరోనా కేసు వెలుగుచూడటంతో అధికారులు అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Updated Date - 2022-01-03T12:52:27+05:30 IST