బంగ్లాదేశ్‌లో అంతర్జాతీయ విమానాల రాకపోకల రద్దు

ABN , First Publish Date - 2021-04-12T13:40:51+05:30 IST

కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ పౌర విమానయాన సంస్థ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.....

బంగ్లాదేశ్‌లో అంతర్జాతీయ విమానాల రాకపోకల రద్దు

బంగ్లా పౌర విమానయాన సంస్థ నిర్ణయం

ఢాకా (బంగ్లాదేశ్): కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ పౌర విమానయాన సంస్థ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి కోసం ఏప్రిల్ 20వతేదీ వరకు అన్ని అంతర్జాతీయ, దేశీయ, స్థానిక, శిక్షణ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రకటించింది. సహాయ, పునరావాస, కార్గో, సాంకేతిక కారణాల వల్ల, ఇంధనం నింపుకునేందుకు విమానాల ల్యాండింగ్ కు మాత్రమే అనుమతిస్తామని బంగ్లాదేశ్ పౌర విమానయాన శాఖ తెలిపింది. ప్రత్యేక విమానాల్లో వచ్చిన ప్రయాణికులు వారి సొంత ఖర్చులతో హోటళ్లలో 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని విమానయాన శాఖ ఆదేశించింది.


ఏప్రిల్ 20వతేదీ వరకు అన్ని రకాల ప్రయాణికుల విమానాలు, ఛార్టర్డ్ విమానాలు, హెలికాప్టర్లను రద్దు చేస్తున్నట్లు బంగ్లాదేశ్ సర్కారు ప్రకటించింది.అనుమతించిన ప్రత్యేక విమానాల్లో శానిటైజ్ చేయాలని, సోషల్ డిస్టెన్సు పాటించాలని కోరింది. బంగ్లాదేశ్ లో ఒక్కరోజే 5,819 కరోనా కేసులు వెలుగుచూశాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి ఖలీదా జియాకు కరోనా సోకింది. 78 మంది కరోనాతో కన్నుమూశారు.

Updated Date - 2021-04-12T13:40:51+05:30 IST