Abn logo
Apr 13 2021 @ 00:50AM

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

లబ్బీపేట, ఏప్రిల్‌ 12 : రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇఫ్తార్‌ను కుటుంబ సమేతంగా ఇళ్లలోనే ముగించుకుని, నమాజుకు మసీదుకు వెళ్లాలని ముస్లిం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కన్వీనర్‌ మునీర్‌ అహ్మద్‌ షేక్‌ తెలిపారు. లబ్బీపేటలోని ఆయన కార్యాల యంలో సోమవారం నగరంలోని వివిధ కమిటీ పెద్దలతో రంజాన్‌ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ కరోనా గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని, ఖచ్చితమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.  మసీదుల లో తిను బండారాలు అను మతించడం లేదని ఖర్జూరం, తాగు నీరుకు మాత్రమే అనుమతించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో మసీదు కమిటీ పెద్దలు మోడ్రన్‌ షుక్రీ, ఉస్మాన్‌, నసీర్‌ ఉమరి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement