- కేంద్రం అనుమతి కోరిన ప్రభుత్వం
చెన్నై: రాష్ట్రంలో కరోనా నింధనలు మరింత కఠినంగా అమలు చేయడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు సెల్వ వినాయగం లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్త రూపుసంతరించుకున్న కరోనా వైరస్ ‘ఒమైక్రాన్’ కేసు బయటపడటంతో ఆ వైరస్ వ్యాప్తి నిరోధానికి మునుపటి కరోనా నిరోధక నిబంధనలలో కొన్నింటిని అమలు చేస్తే బాగుంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకరికి ‘ఒమైక్రాన్’ సోకినట్టు నిర్ధారణ అయ్యిందని, 28 మందికి ‘ఒమైక్రాన్’ వైద్యపరీక్షలు జరుపుతున్నామని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో మరింతగా కరోనా నిరోధక నిబంధనలు అమలు చేయడానికి అనుమతి మంజూరు చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి