మహిళా సంఘాలకు కోవిడ్‌ రిలీఫ్‌ రుణాల మంజూరు

ABN , First Publish Date - 2020-06-07T10:27:19+05:30 IST

మహిళా సంఘాలకు ప్రత్యేకంగా కరోనా దృష్ట్యా కోవిడ్‌ రిలీఫ్‌ రుణాల పథకం కింద రూ.45 లక్షల రుణాల ను మంజూరు చేసినట్లు...

మహిళా సంఘాలకు కోవిడ్‌ రిలీఫ్‌ రుణాల మంజూరు

డీపీఎం సుధాకర్‌ వెల్లడి

మద్నూర్‌, జూన్‌ 6: మహిళా సంఘాలకు ప్రత్యేకంగా కరోనా దృష్ట్యా కోవిడ్‌ రిలీఫ్‌ రుణాల పథకం కింద రూ.45 లక్షల రుణాల ను మంజూరు చేసినట్లు డీపీఎం సుధాకర్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో అధికారులు, సిబ్బంది తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు లింకేజీ, కోవిడ్‌ రుణాలు, జీవనోపాధులు, ఆడిట్‌ తదితర అంశాలపై వెలుగు సిబ్బందితో సమీక్షించినట్లు ఆయన వెల్లడించారు. మండల ంలో 90మహిళా సంఘాలకు 45లక్షల మేరకు రుణాలు అందజేసిన ట్లు ఆయన వెల్లడించారు. ప్రతీ మహిళా సంఘంలో మహిళకు 5 వేల చొప్పున ప్రభుత్వం రుణం అందజేస్తుందని, వాటిని మూడు నెలల అనంతరం తిరిగి చెల్లించాలని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రవీందర్‌, సీసీలు తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-07T10:27:19+05:30 IST