సిద్దిపేట: పట్టణంలోని మూడు ఎస్ బిఐ బ్యాంకు బ్రాంచీల్లో 8 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా తేలింది. మరికొందరికి కరోనా లక్షణాలు బయట పడ్డాయి. దీంతో రెండు బ్రాంచ్ లలో బ్యాంక్ లో సేవలు నిలిచి పోయాయి. ఈ సమాచారం వెలుగు చూడడంతో సిద్ధిపట పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.