35 మంది మెడికోలకు Covid పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-01-06T17:32:15+05:30 IST

బళ్లారిలోని విజయనగర వైద్య కళాశాలకు చెందిన 35 మంది మెడికోలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరు ఉంటున్న హస్టళ్లో 250 మంది విద్యార్థులు ఉండగా మంగళవారం 35 మందికి వైరస్‌ సోకింది. ఈ

35 మంది మెడికోలకు Covid పాజిటివ్‌

బళ్లారి(కర్ణాటక): బళ్లారిలోని విజయనగర వైద్య కళాశాలకు చెందిన 35 మంది మెడికోలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరు ఉంటున్న హస్టళ్లో 250 మంది విద్యార్థులు ఉండగా మంగళవారం 35 మందికి వైరస్‌ సోకింది. ఈ విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. హాస్టల్లో ఉన్న మిగిలిన విద్యార్థులకు బుధవారం కొవిడ్‌ ర్యాండమ్‌ టెస్టు చేయించామని విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ గంగాధరగౌడ తెలిపారు. వైరస్‌ సోకిన విద్యార్థులు రెండవ, మూడవ సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్నారని, వీరు ఆసుపత్రిలో పనిచేయడం వల్ల వైరస్‌ సోకినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2022-01-06T17:32:15+05:30 IST