Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 27 2021 @ 07:48AM

వారంలో రెండింతలైన పాజిటివిటీ రేటు... కరోనా థర్డ్ వేవ్‌కు సంకేతం?

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరోమారు విజృంభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెలువడుతున్న గణాంకాలే ఇందుకు సూచికలుగా నిలుస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య రెండింతలయ్యింది. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం నాడు పాజిటివిటీ రేటు 3.4 శాతంగా నమోదయ్యింది. అంతకుమందు వారంలో ఇది 1.68 శాతంగా ఉంది. ఈ గణాకాలు అందరిలో ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గడానికి బదులు రోజురోజుకు పెరుగుతుండటం గమనార్హం. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే కరోనా థర్డ్ వేవ్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. 

కరోనా సెకెండ్ వేవ్ సమయంలో పాజిటివిటీ రేటు 18 నుంచి 20 శాతం వరకూ చేరుకుంది. జూలై 20 వరకూ పాజిటివిటీ రేటు తగ్గుతూ వచ్చింది. అయితే ఆ తరువాత నుంచి పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.  కరోనా పాజిటివిటీ రేటు జూలై 20 నుంచి జూలై 26 మధ్యకాలంలో ఇలా ఉంది....

జూలై 20 - 1.68%

జూలై 21 --- 2.27%

జూలై 22 --- 2.4%

జూలై 23  --- 2.12%

జూలై 24 --- 2.4%

జూలై 25  ---- 2.31%

జూలై 26 --- 3.4%

Advertisement
Advertisement