యాదాద్రి ఆలయ ఉద్యోగులు, అర్చకుల్లో 30మందికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-03-28T02:23:52+05:30 IST

యాదాద్రి ఆలయ ఉద్యోగులు, అర్చకుల్లో 30మందికి కరోనా సోకింది. వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఆలయ సిబ్బందికి వైరస్‌ సోకింది.

యాదాద్రి ఆలయ ఉద్యోగులు, అర్చకుల్లో 30మందికి కరోనా పాజిటివ్‌

యాదాద్రి: యాదాద్రి ఆలయ ఉద్యోగులు, అర్చకుల్లో 30మందికి కరోనా సోకింది. వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న ఆలయ సిబ్బందికి వైరస్‌ సోకింది. యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రిలో దైవదర్శనాలకు మాత్రమే భక్తులకు అనుమతించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో అధికారులు కరోనా నిబంధనలు పాటించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహోత్సవాల నిర్వహణ సమయంలో కరోనా నియమాలను ఏమాత్రం పాటించకపోవడం వల్లే ఆలయ సిబ్బందికి కరోనా సోకినట్లు విమర్శలు ఉన్నాయి. అలంకార సేవోత్సవాలు, స్వామి వారి విశేష వేడుకల్లో భౌతిక దూరం, మాస్క్‌లు ధరించకపోడం, శానిటైజేషన్‌ చేయకపోవడం కారణాలుగా తెలుస్తున్నాయి.

Updated Date - 2021-03-28T02:23:52+05:30 IST