వారం రోజుల్లో 4,512 Covid పాజిటివ్‌ కేసుల

ABN , First Publish Date - 2022-06-24T16:42:05+05:30 IST

రాజధాని బెంగళూరు నగరంలో క్రమేపీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పూర్తిస్థాయి అప్రమత్తతను పాటిస్తున్నామని బీబీఎంపీ చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌

వారం రోజుల్లో 4,512 Covid పాజిటివ్‌ కేసుల

                       - బెంగళూరులోని 10 వార్డుల్లో అత్యధికంగా కరోనా


బెంగళూరు, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు నగరంలో క్రమేపీ కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో పూర్తిస్థాయి అప్రమత్తతను పాటిస్తున్నామని బీబీఎంపీ చీఫ్‌ కమిషనర్‌ తుషార్‌ గిరినాధ్‌ వెల్లడించారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే నగరవ్యాప్తంగా ఆరోగ్యశాఖాధికారులకు పలు సూచనలు చేశామన్నారు. నగరంలోని 10 వార్డుల్లో అత్యధికంగా కొవిడ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు. ఈ పది వార్డులపై ప్రత్యేక దృష్టిని సారించడంతో పాటు కొవిడ్‌ పరీక్షలను అధికం చేశామన్నారు. వారం రోజుల అవధిలోనే నగరంలో కొత్తగా 4,512 కోవిడ్‌ కేసులు వెలుగు చూశాయన్నారు. బనశంకరి, హొసకరెహళ్ళి, కింగేరి, చలవాది పాళ్య, రాయపుర, పాదరాయణపుర, బాపూజీనగర, నాయండహళ్ళి, మారుతి మందిర తదితర వార్డుల్లో కేసులు అధికంగా నమోదయ్యాయన్నారు. ప్రతిరోజూ నగరంలో 16వేల మందికి కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నామని దీనిని సోమవారం నుంచి 20 వేలకు పెంచబోతున్నట్లు చెప్పారు.  కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో దాఖలవుతున్న వారి సంఖ్య 1 శాతంలోపే ఉందని ఆయన వివరించారు.



Updated Date - 2022-06-24T16:42:05+05:30 IST