కరోనా నుంచి కోలుకున్న నెలల వ్యవధిలోనే మళ్లీ లక్షణాలు: ఆక్స్‌ఫర్డ్ స్టడీ

ABN , First Publish Date - 2020-10-20T07:20:16+05:30 IST

కరోనా బారిన పడి కోలుకున్న వారిలో రెండు నుంచి మూడు నెలల తర్వాత మళ్లీ లక్షణాలు కనపడుతున్నట్టు

కరోనా నుంచి కోలుకున్న నెలల వ్యవధిలోనే మళ్లీ లక్షణాలు: ఆక్స్‌ఫర్డ్ స్టడీ

లండన్: కరోనా బారిన పడి కోలుకున్న వారిలో రెండు నుంచి మూడు నెలల తర్వాత మళ్లీ లక్షణాలు కనపడుతున్నట్టు యూకే స్డడీ తేల్చింది. ఆసుపత్రిలో పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయినప్పటికి సగం మందికి పైగా పేషంట్లలో ఊపిరి సరిగ్గా ఆడకపోవడం, ఆందోళన, అలసట వంటి లక్షణాలు నెలల వ్యవధిలో మళ్లీ కనిపిస్తున్నట్టు యూకే స్టడీ చెబుతోంది. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన 58 మంది రోగులలో కరోనా దీర్ఘకాలిక ప్రభావానికి సంబంధించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన జరిపారు. 


కరోనా సోకిన రెండు, మూడు నెలల తర్వాత 64 శాతం మంది పేషంట్లు సరిగ్గా ఊపిరి తీసుకోలేక పోతున్నట్టు, 55 శాతం మంది అలసటకు గురవుతున్నట్టు పరిశోధనలో తేలింది. 60 శాతం మంది పేషంట్ల ఊపిరితిత్తుల్లో, 29 శాతం మంది పేషంట్ల కిడ్నీలలో, 26 శాతం మంది గుండెలో, 10 శాతం మంది పేషంట్ల కాలేయంలో అసాధారణ మార్పులను ఎమ్మారై స్కాన్‌లో పరిశోధకులు గుర్తించారు.

Updated Date - 2020-10-20T07:20:16+05:30 IST