అంబులెన్స్‌లోనే ప్రసవించిన కోవిడ్ పేషెంట్

ABN , First Publish Date - 2020-08-13T21:22:00+05:30 IST

కేరళకు చెందిన ఓ మహిళ (38) కరోనా పేషెంట్. అంతే కాకుండా ఆమె నిండు గర్భవతి. ఓ వైపు కరోనా చికిత్స పొందుతూనే, పుట్టబోయే బిడ్డ గురించి తగిన జాగ్రత్తలు పడుతోంది. ఇంతలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి

అంబులెన్స్‌లోనే ప్రసవించిన కోవిడ్ పేషెంట్

తిరువనంతపురం: కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ.. అంబులెన్స్‌లోనే ప్రసవించింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్న అంబులెన్స్ సిబ్బందే ఆమెకు సపర్యలు చేశారు. ఈ విషయమై ఆరోగ్యశాఖ మంత్రి అంబులెన్స్ సిబ్బందిని అభినందించారు. కరోనా విపత్కర కాలంలో ఓ మహిళ ప్రసవానికి సహకరించిన సిబ్బంది నిజమైన మానవతావాదులని పొగడ్తలు కురిపించారు.


కేరళకు చెందిన ఓ మహిళ (38) కరోనా పేషెంట్. అంతే కాకుండా ఆమె నిండు గర్భవతి. ఓ వైపు కరోనా చికిత్స పొందుతూనే, పుట్టబోయే బిడ్డ గురించి తగిన జాగ్రత్తలు పడుతోంది. ఇంతలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఫోన్‌లో విషయం అందుకుని కొంత మంది సిబ్బందితో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. పురిటి నొప్పులతో ఉన్న మహిళను బండి ఎక్కించుకుని ఆసుపత్రికి బయల్దేరారు. అయితే ఆమె ప్రయాణంలో ప్రసవించింది. ఆమె ప్రసవం ఆరోగ్యంగా జరగడంలో అంబులెన్స్ సిబ్బంది పాత్ర ఎంతగానో ఉంది.


విషయం తెలుసుకున్న మంత్రి కేకే శైలజానాథ్.. అంబులెన్స్ సిబ్బందిని అభినందించారు.

Updated Date - 2020-08-13T21:22:00+05:30 IST