కట్టడి కాని కరోనా

ABN , First Publish Date - 2021-05-17T06:57:22+05:30 IST

రెండు వారాలుగా ప్రభుత్వం పాక్షిక లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కరోనా కట్టడి కావడంలేదు.

కట్టడి కాని కరోనా

తాజా కేసులు 2885 

తిరుపతి, మే 16 (ఆంధ్రజ్యోతి): రెండు వారాలుగా ప్రభుత్వం పాక్షిక లాక్‌డౌన్‌ విధించినప్పటికీ కరోనా కట్టడి కావడంలేదు. రోజువారీ పాజిటివ్‌ లెక్కలే దీనికి నిదర్శనం. పల్లెల్లోనూ పాకినవైరస్‌ జనజీవనాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో శనివారం ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకు 2885 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా, పది మంది మృతిచెందారు. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 156937కు.. మరణాలు 1094కు చేరాయి. శనివారం ఉదయానికి యాక్టివ్‌ కేసులు 23436గా ఉన్నాయి. కొత్తగా గుర్తించి కేసులు.. తిరుపతి నగరంలో 228, తిరుపతి రూరల్‌లో 98, చిత్తూరు, మదనపల్లె అర్బన్‌లో 88 చొప్పున, పలమనేరు 78, మదనపల్లె రూరల్‌ 68, పీలేరు 65, పెద్దపంజాణి 58, గంగవరం, పలమనేరు మండలాల్లో 55 చొప్పున, రామకుప్పం 52, పులిచెర్ల, ములకలచెరువు, రామసముద్రంలో 51 చొప్పున, బైరెడ్డిపల్లి 50, పుంగనూరు రూరల్‌ 48, నగరి అర్బన్‌ 47, కుప్పం, శాంతిపురం రూరల్లో 45 చొప్పున, వి.కోట, ఐరాల, కురబలకోట, చౌడేపల్లి, గుడుపల్లి మండలాల్లో 44 చొప్పున, పూతలపట్టు 43, పుత్తూరు, తవణంపల్లి, గుర్రంకొండలో 41 చొప్పున, బంగారుపాళెం, పాకాల, జీడీ నెల్లూరులో 40 చొప్పున, రేణిగుంట, చినగొట్టిగల్లులో 39 చొప్పున, శ్రీకాళహస్తి అర్బన్‌ 38, సోమలలో 37 చొప్పున, శ్రీరంగరాజపురం, పుంగనూరు, సదుం, సత్యవేడులో 34 చొప్పున, కార్వేటినగరం 32, కలికిరి 31, వెదురుకుప్పం, పెదమండ్యం, పుత్తూరు రూరల్లో 30 చొప్పున, ఏర్పేడు, రొంపిచెర్ల, గుడిపాల, నాగలాపురంలో 28 చొప్పున, చంద్రగిరి 27, నారాయణవనం, నిండ్రలో 25 చొప్పున, యాదమరి 24, కంబంవారిపల్లిలో 23, విజయపురం 22, నగరి 20, రామచంద్రాపురం, వడమాలపేటలో 19 చొప్పున, వడమాలపేట, చిత్తూరు రూరల్లో 17 చొప్పున, పిచ్చాటూరు 16, కలకడ, వరదయ్యపాళెంలో 13 చొప్పున, బుచ్చినాయుడు కండ్రిగ 9, నిమ్మనపల్లి, శ్రీకాళహస్తి రూరల్‌, కేవీబీపురంలో 8 చొప్పున, వాల్మీకిపురం, తొట్టంబేడులో 8 చొప్పున, పాలసముద్రంలో 5 కేసులు వంతున నమోదయ్యాయి.  


రుయాలో ఐసీయూ బెడ్స్‌ కుదింపు?

రుయాస్పత్రిలో ఐసీయూ పడకలను తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. రుయాలో 750 పడకల సామర్థ్యం ఉండగా.. కరోనా నేపథ్యంలో 890కి పెంచారు. ఇందులో ఐసీయూ బెడ్స్‌ 145, ఆక్సిజన్‌ బెడ్స్‌ 465, నాన్‌ ఆక్సిజన్‌ బెడ్స్‌ 290 ఉన్నాయి. ఆక్సిజన్‌ కొరత కారణంగా రెండు రోజులుగా ఐసీయూ, ఆక్సిజన్‌ పడకలను కుదిస్తున్నట్టు సమాచారం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అధికారులు పడకలను తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. 750 పడకలతోనే కొవిడ్‌ వైద్యం చేయాలని తద్వారా ఆక్సిజన్‌ కొరతను తగ్గించుకోవడంతో పాటు సిబ్బందిపై పనిఒత్తిడి ఉండదనేది రుయా అధికార వర్గాల వాదన. 



Updated Date - 2021-05-17T06:57:22+05:30 IST