Covid వ్యాప్తి చెందకుండా Gcc చర్యలు

ABN , First Publish Date - 2022-07-07T14:01:18+05:30 IST

కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు నగరంలో పలు ప్రాంతాల్లో నిఘా కమిటీలను నియమించినట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ప్రకటించింది. నగరంలో ఇటీవల

Covid వ్యాప్తి చెందకుండా Gcc చర్యలు

ప్యారీస్‌(చెన్నై), జూలై 6: కరోనా వ్యాప్తి అడ్డుకునేందుకు నగరంలో పలు ప్రాంతాల్లో నిఘా కమిటీలను నియమించినట్లు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ (జీసీసీ) ప్రకటించింది. నగరంలో ఇటీవల కాలంలో కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. జీసీసీ నిర్వహణలోని 15 జోన్లను పర్యవేక్షించేందుకు 15 నిఘా కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇందులో కార్పొరేషన్‌ ఆరోగ్యశాఖ అధికారి నేతృత్వంలో ఇద్దరు శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, మరో ఇద్దరు జాతీయ నగరాభివృద్ధి ఉద్యోగులుంటారు. నగర బహిరంగ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అడ్డుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నిఘా కమిటీలు పని చేస్తాయి. జన సంచారం అధికంగా వున్న ప్రాంతాల్లో ఈ కమిటీలు తనిఖీలు నిర్వహించి, మాస్క్‌ ధరించనివారికి రూ.500 జరిమానా విధిస్తాయి. కరోనా కేసులు తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు జీసీసీ పేర్కొంది. ఆ మేరకు నగరంలో అధికారులు విస్త్రతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2022-07-07T14:01:18+05:30 IST