కరోనా ఎట్‌ 377

ABN , First Publish Date - 2022-01-15T05:52:56+05:30 IST

కరోనా మూడో దశ వ్యాప్తి విజృంభణ కొనసాగుతోన్నది. శుక్రవారం ఒక్క రోజే 377 మంది జిల్లాలో కొవిడ్‌-19 బారిన పడ్డారు.

కరోనా ఎట్‌ 377

సగం కేసులు గుంటూరులోనే

10.50 శాతానికి చేరిన పాజిటివ్‌ రేట్‌


గుంటూరు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): కరోనా మూడో దశ వ్యాప్తి విజృంభణ కొనసాగుతోన్నది. శుక్రవారం ఒక్క రోజే 377 మంది జిల్లాలో కొవిడ్‌-19 బారిన పడ్డారు. మొత్తంగా 3,589 మందికి టెస్టులు చేయగా 10.50 శాతంగా పాజిటివ్‌ రేట్‌ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోన్నది. కొత్తగా నమోదైన కేసులతో కలిసి ప్రస్తుతం 1,359 క్రియాశీలక కేసులు కొనసాగుతోండగా వారిలో 1,260 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే 93 శాతం మంది వరకు ఆస్పత్రులు అవసరం ఉండటం లేదు. ఆస్పత్రుల్లో 99 మంది చికిత్స పొందుతున్నారు. శుక్రవారం గుంటూరు నగరంలో 165, మంగళగిరిలో 48, తాడేపల్లిలో 32, నరసరావుపేటలో 15, చిలకలూరిపేటలో 12, బాపట్లలో 10, తెనాలిలో 9, సత్తెనపల్లిలో 8, కొల్లిపరలో 7, పెదకాకానిలో 6, పొన్నూరులో 6, గుంటూరు రూరల్‌లో 6, దాచేపల్లిలో 5, మేడికొండూరులో 4, తాడికొండలో 3, మాచర్లలో 3, పిడుగురాళ్లలో 3, నాదెండ్లలో 3, వట్టిచెరుకూరులో 2, తుళ్లూరులో 2, ప్రత్తిపాడులో 2, కొల్లూరులో 2, బెల్లంకొండలో 2, కాకుమానులో 2, దుగ్గిరాలలో 1, నిజాంపట్నంలో 1, చేబ్రోలులో 1, భట్టిప్రోలులో 1, అమరావతిలో 1, అచ్చంపేటలో 1, క్రోసూరులో 1, పెదకూరపాడులో 1, పెదనందిపాడులో 1, ఫిరంగిపురంలో 1, దుర్గిలో 1, గురజాలలో 1, రెంటచింతలలో 1, యడ్లపాడులో 1, నూజెండ్లలో 1, నకరికల్లులో 1, వినుకొండలో 1, కర్లపాలెంలో 1, రేపల్లెలో 1, చుండూరులో 1 కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 


Updated Date - 2022-01-15T05:52:56+05:30 IST