వామ్మో.. వైరస్‌!

ABN , First Publish Date - 2021-05-17T06:37:32+05:30 IST

కరోనా వైరస్‌ జిల్లాలో విస్ఫోటం రేపింది. ఇప్పటివరకు ఎన్నడూలేనంతగా ఒకే రోజు అత్యధిక కేసులు జిల్లాలో నమోదయ్యాయి. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక కేసులు, మరణాలు నమోదై మొదటి స్థానంలో ఆదివారం నిలిచింది. గడిచిన ఒక్క రోజులోనే జిల్లాలో 3356 మంది కరోనా బారిన పడ్డారు.

వామ్మో.. వైరస్‌!

రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక కేసులు

ఒక్క రోజులో 3356 మందికి కరోనా

14 మంది మృత్యువాత


అనంతపురం వైద్యం, మే16: కరోనా వైరస్‌ జిల్లాలో విస్ఫోటం రేపింది. ఇప్పటివరకు ఎన్నడూలేనంతగా ఒకే రోజు అత్యధిక కేసులు జిల్లాలో నమోదయ్యాయి. రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక కేసులు, మరణాలు నమోదై మొదటి స్థానంలో ఆదివారం నిలిచింది. గడిచిన ఒక్క రోజులోనే జిల్లాలో 3356 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మహమ్మారికి మరో 14 మంది 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారు. అంటే జిల్లాలో వైరస్‌ ప్రభావం ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ప్రతి చోటా కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తోంది. బాధితులు చికిత్స కోసం ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వసతులు లేక, సకాలంలో వైద్య సేవలు అందక అల్లాడిపోతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 114217 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 95969 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 783 మంది చనిపోయారు. ప్రస్తుతం 17465 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


కొత్త కేసుల నమోదు ఇలా..

జిల్లాలో ఒక్కరోజులో 7456 శాంపిల్స్‌ పరీక్షించగా.. 3356 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అనంతపురంలో 438, ధర్మవరం 192, పెనుకొండ 168, హిందూపురం 167, కదిరి 159, కళ్యాణదుర్గం 131, తాడిపత్రి 117, గోరంట్ల, రాయదుర్గం 105, అమరాపురం 96, పుట్టపర్తి 90, సీకేపల్లి 81, ఉరవకొండ 69, గుత్తి 60, యాడికి 58, వజ్రకరూరు 53, చిలమత్తూరు 51, మడకశిర 51, గుంతకల్లు 50, రొద్దం 47, రొళ్ల 46, తనకల్లు 44, బొమ్మనహాళ్‌, గుమ్మఘట్ట, ఎనపికుంట 42, బత్తలపల్లి 41, గుడిబండ, కణేకల్లు 40, కొత్తచెరువు 39, ఓడీసీ, శెట్టూరు 38, నల్లమాడ, పరిగి, తాడిమర్రి 35, బుక్కపట్నం 34, కంబదూరు 33, తలుపుల 32, బెలుగుప్ప, కూడేరు, రాప్తాడు, సోమందేపల్లి 28, నార్పల 27, విడపనకల్లు 25, బుక్కరాయసముద్రం 23, శింగనమల 21, ఆత్మకూరు, రామగిరి 19, పుట్లూరు 16, ఆమడగూరు, గాండ్లపెంట, కుందుర్పి 14, పెద్దవడగూరు, పామిడి 13, లేపాక్షి 12, యల్లనూరు 12, డీ హీరేహాళ్‌, గార్లదిన్నె 11, అగళి, ముదిగుబ్బ 6, నల్లచెరువు, పెద్దపప్పూరు 5, బ్రహ్మసముద్రంలో 3 కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2021-05-17T06:37:32+05:30 IST