Advertisement
Advertisement
Abn logo
Advertisement

50 మందికి కరోనా

గుంటూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 50 మంది కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఉదయం వరకు 1,858 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగగా 2.69 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. వినుకొండలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఒకే రోజున 68 మంది హోం ఐసోలేషన్‌ నుంచి కోలుకోవడంతో క్రియాశీలక కేసుల సంఖ్య 553కి తగ్గింది. కొత్తగా గుంటూరులో 17, తాడేపల్లిలో 6, చెరుకుపల్లిలో 3, రేపల్లెలో 3, వట్టిచెరుకూరులో 2, మంగళగిరిలో 2, మాచర్లలో 2, చిలకలూరిపేటలో 2, తెనాలిలో 2, చుండూరులో 2, నరసరావుపేటలో 2, దాచేపల్లిలో 1, పెదకాకానిలో 1, ప్రత్తిపాడులో 1, అచ్చంపేటలో 1, పిట్టలవానిపాలెంలో 1, చేబ్రోలులో 1, నిజాంపట్నం లో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇన్‌ఛార్జ్‌ అధికారి డాక్టర్‌ టీ జయసింహ తెలిపారు. వ్యాక్సినేషన్‌లో భాగంగా 27,899 మందికి తొలి డోసు, 16,657 మందికి రెండో డోసు టీకా వేశారు. దీంతో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా కనీసం ఒక డోసు చేయించుకున్న వారి సంఖ్య 31 లక్షల 19 వేల 316, రెండో డోసు చేయించుకున్న వారు 13 లక్షల 75 వేల 966కి చేరింది.  

Advertisement
Advertisement