జర్నలిస్టులకు కొవిడ్‌ వైద్య సాయం

ABN , First Publish Date - 2020-08-10T10:13:19+05:30 IST

కరోనాపై పోరాడుతూ వైరస్‌ భారిన పడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు సత్వర వైద్యం అందించేందుకు సమాచార శాఖ ..

జర్నలిస్టులకు కొవిడ్‌ వైద్య సాయం

గుంటూరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కరోనాపై   పోరాడుతూ వైరస్‌ భారిన పడిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు సత్వర వైద్యం అందించేందుకు సమాచార శాఖ తరపున నోడల్‌ అధికారిగా డివిజనల్‌ పౌర సంబంధాల అధికారి జే శ్యాంకుమార్‌, వైద్య ఆరోగ్య శాఖ తరపున డాక్టర్‌ కే కృష్ణకుమార్‌ని నియమించినట్లు కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. వీరు ఇద్దరూ జిల్లాలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన కొవిడ్‌ వైద్య సేవల కోసం సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారన్నారు. కొవిడ్‌ ఆస్పత్రుల నోడల్‌ అధికారులు కూడా జర్నలిస్టులకు కరోన వైద్యం అందించడంలో కోఆర్డినేటర్లుగా సహకారం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. కొవిడ్‌ భారిన జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల వైద్య సాయం కోసం శ్యాంకుమార్‌(9985615089), డాక్టర్‌ కృష్ణకుమార్‌(9848782615)లను సంప్రదించాలన్నారు. ఈ సందర్భంలో జర్నలిస్టులు తమ అక్రిడిటేషన్‌ నెంబరు, ఆధార్‌ వంటి వివరాలను తెలియజేయాల్సి ఉంటుందన్నారు. 

Updated Date - 2020-08-10T10:13:19+05:30 IST