Covid Lockdown సడలింపులు.. పెరిగిన విమాన సేవలు

ABN , First Publish Date - 2022-02-17T15:56:35+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో చెన్నై విమానాశ్రయం నుంచి బుధవారం 196 విమాన సర్వీసులు నడపడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత గత ఏడాది డిసెంబరులో

Covid Lockdown సడలింపులు.. పెరిగిన విమాన సేవలు

ప్యారీస్‌(చెన్నై): కరోనా లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో చెన్నై విమానాశ్రయం నుంచి బుధవారం 196 విమాన సర్వీసులు నడపడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత గత ఏడాది డిసెంబరులో సుమారు 180 విమాన సర్వీసులు నడుపగా, ప్రయాణికుల సంఖ్య 34 వేలకు పైగా ఉంది. అనంతరం కరోనా థర్డ్‌వేవ్‌ వ్యాప్తితో లాక్‌డౌన్‌ అమలుకు రావడం, కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా విమాన సేవలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గడంతో, విదేశీ ప్రయాణికులకు పలు మినహాయింపులు కల్పించారు. ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు, 7 రోజులు క్వారంటైన్‌ తదితరాల నుంచి మినహాయింపులు ఇవ్వడంతో, బుధవారం చెన్నై విమానాశ్రయం నుంచి 54 అంతర్జాతీయ ప్రత్యేక విమానాలు సహా 196 స్వదేశీ విమానాలు బయల్దేరి వెళ్లాయి.

Updated Date - 2022-02-17T15:56:35+05:30 IST