కొవిడ్-19‌పై కర్ణాటక డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-07-13T13:19:06+05:30 IST

కొవిడ్-19 పై కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాడి సంచలన వ్యాఖ్యలు చేశారు.....

కొవిడ్-19‌పై కర్ణాటక డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

కొవిడ్-19 తీవ్రమైన అంటువ్యాధి కాదు...

బెల్గావీ (కర్ణాటక): కొవిడ్-19 పై కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సావాడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తీవ్రమైన అంటు వ్యాధి కాదని డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సావాడి వ్యాఖ్యానించారు. ‘‘కొవిడ్ -19 తీవ్రమైన అంటువ్యాధి కాదు..కరోనాతో కలిసి జీవించడం మనం నేర్చుకోవాలి, దాని గురించి మనం ఎక్కువగా ఆందోళన చెందకూడదు, మనం మన జీవితాలను సాధారణ పద్ధతిలో కొనసాగించాలి’’ అని వ్యాపారులు, అధికారుల సమావేశంలో లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను కూడా కరోనా వైరస్ బారిన పడ్డాను కాని, నాకు తెలియకుండానే దాన్ని నయం చేయగలిగాను. అధికారిక సందర్శనలు, సమావేశాల కోసం నేను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాను. నేను చాలా మందిని కలిశాను. నాకు సులభంగా సంక్రమణను సంక్రమించి ఉండవచ్చు. ఇది నా శరీరాన్ని ప్రవేశించినంత తేలికగా వదిలివేసి ఉండాలి. నన్ను నేను పరీక్షించుకున్నాను. నేను ఇప్పుడు పరీక్షించినట్లయితే (యాంటీ బాడీస్ కోసం), కొంతకాలం క్రితం నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందని ఇది చూపిస్తుంది. అందువల్ల, భయపడాల్సిన అవసరం లేదు’’ అని డిప్యూటీ సీఎం అన్నారు. అథానీ తాలూకాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరో వారంరోజుల పాటు స్వచ్ఛంద లాక్ డౌన్ ను పొడిగించాలని వ్యాపారుల సంఘం నిర్ణయించింది. కరోనా రోగులకు చికిత్స చేయని ప్రైవేటు క్లినిక్ లపై చర్యలు తీసుకోవాలని వ్యాపారులు మంత్రిని డిమాండ్ చేశారు. క్లినిక్ లపై చర్యలు తీసుకోమని ప్రభుత్వం హామీ ఇస్తే పనిచేస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ మల్లికార్జున్ హంజీ చెప్పారు. 

Updated Date - 2020-07-13T13:19:06+05:30 IST