కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో ఉన్నాం: సీఎం జగన్

ABN , First Publish Date - 2022-02-03T01:17:28+05:30 IST

ప్రస్తుతం మనం కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో ఉన్నామని సీఎం

కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో ఉన్నాం: సీఎం జగన్

అమరావతి: ప్రస్తుతం మనం కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో ఉన్నామని సీఎం జగన్ అన్నారు. అధికారులతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జగన్ మాట్లాడారు. కరోనా నుంచి రికవరీ రేటు ప్రస్తుతం 94.72 శాతం ఉందని ఆయన తెలిపారు. కొద్ది రోజుల క్రితం గరిష్టంగా 36.02 శాతం ఉన్న పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందన్నారు.  ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 17.73 శాతం ఉందన్నారు.  కోవిడ్‌ నివారణకు ఇదివరకు ఉన్న ఆంక్షలను కొనసాగిస్తున్నామన్నారు.  మరో 2 వారాలపాటు రాత్రిపూట కర్ఫ్యూను, ఆంక్షలను కొనసాగిస్తూ ఇప్పటికే వైద్యశాఖ అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారని ఆయన తెలిపారు. నైట్‌ కర్ఫ్యూ, మాస్క్‌ ధరించకపోతే ఫైన్‌ విధించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది గుమికూడకుండా చూడాలన్నారు. సినిమా ధియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో కోవిడ్‌ నిబంధనలు, సోషల్‌ డిస్టేన్స్‌ పాటించేలా చూడాలన్నారు. కచ్చితంగా ఈ ఆంక్షలను అమలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.


ఒమిక్రాన్‌ గరిష్ట తీవ్రతకు చేరి క్రమంగా తగ్గుముఖం పడుతుందన్నారు.  ఈ 2 వారాలు కోవిడ్‌ నివారణా చర్యలు తీసుకోవడం, జాగ్రత్తలు పాటించడం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.  1,05,930 మందికి పాజిటివ్‌ ఉంటే అందులో 2,286 మంది మాత్రమే ఆస్పత్రిలో చేరారని ఆయన తెలిపారు.  పాజిటివ్‌ కేసుల్లో కేవలం 2.16 శాతం మంది మాత్రమే ఆస్పత్రికి వెళ్తున్నారన్నారు.  ఇందులో కేవలం 1.29శాతం మంది మాత్రమే ఆక్సిజన్‌ స్థితికి వెళ్తున్నారని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2022-02-03T01:17:28+05:30 IST