రెమ్‌డిసివిర్‌ లెక్క తేలాల్సిందే..

ABN , First Publish Date - 2021-05-14T05:37:34+05:30 IST

కొవిడ్‌ వైద్యం, మందుల విషయంలో అక్రమాలు, బ్లాక్‌ మార్కెటింగ్‌ను సహించేది లేదని పదేపదే చేస్తున్న హెచ్చ రికలను కూడా లెక్క చేయకుండా ‘రెమ్‌డిసివిర్‌’ అక్రమాలకు పాల్పడడంపై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సీరియస్‌ అయ్యారు.

రెమ్‌డిసివిర్‌ లెక్క తేలాల్సిందే..

కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏలూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ వైద్యం, మందుల విషయంలో అక్రమాలు, బ్లాక్‌ మార్కెటింగ్‌ను సహించేది లేదని పదేపదే చేస్తున్న హెచ్చ రికలను కూడా లెక్క చేయకుండా ‘రెమ్‌డిసివిర్‌’ అక్రమాలకు పాల్పడడంపై కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా సీరియస్‌ అయ్యారు. ఈ వ్యవహారంపై గురువారం ఆయన అన్ని స్థాయిల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అధికారులందరినీ అలెర్ట్‌ చేశారు. రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్ల లెక్క తేలాలని అధికారులను ఆదేశించారు. ఏయే ఆసుపత్రులకు ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చారు. ఎన్ని వినియోగించారు, కాళీ సీసాలను వెనక్కి అప్పజెప్పారా లేదా వంటి పలు అంశాలపై పూర్తిస్థాయి పరిశోధన చేయా లని, ఈ అక్రమాల వెనుక ఎవరెవరు ఉన్నారనేది పక్కాగా తేల్చాలని స్పష్టం చేశారు. బ్లాక్‌ మార్కెటింగ్‌పై కూడా అధికా రులు దృష్టి సారించాలన్నారు. ఈ మొత్తం అంశాల పరిశీలనా బాధ్యత ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లదేనని చెప్పారు. రుయా ఘటన నేపథ్యంలో ఆసుపత్రుల వసతులపై ఆయన చర్చించారు. ఆసుపత్రుల్లో విద్యుత్‌ అంతరాయం లేకుండా ఉండాలని, జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. జేసీ వెంకటరమణారెడ్డి, హిమాన్షు శుక్లా, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి డీఆర్‌వో ఉదయ భాస్కర్‌, జిల్లా ఫైర్‌ అధికారి శంకరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2021-05-14T05:37:34+05:30 IST