వైరస్‌ విలయం

ABN , First Publish Date - 2020-08-07T11:32:18+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ విలయం సృష్టిస్తోంది. వేలాదిమందిని వరుసపెట్టి వైరస్‌ చుట్టుముట్టేస్తోంది. ప్రతిరోజూ వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యేలా చేస్తోం ది.

వైరస్‌ విలయం

జిల్లాలో కొవిడ్‌ కేసుల విలయం

గడిచిన 24 గంటల్లో జిల్లాలో 1,351 మందికి వైరస్‌ నిర్ధారణ

కాకినాడ సిటీలో 326, రాజమహేంద్రవరం నగరంలో 301 మందికి 

అమలాపురం 85, తుని 64, కరప 52, కాకినాడ రూరల్‌ 49, ప్రత్తిపాడు 32

జిల్లాలో 27,580కి చేరిన కేసులు.. మొత్తం కొవిడ్‌ మరణాలు 205

అటు ‘తూర్పు’లో అత్యధిక కేసుల నేపథ్యంలో ప్రజల్లో ఇన్ఫెక్షన్‌ శాతంపై సర్వే 

రంగంలోకి ఆరు బృందాలు.. వారం పాటు 28 మండలాల్లో అధ్యయనం

కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకోని 7,350 మంది నుంచి రక్త నమూనాల సేకరణ

గుంటూరు ఐజీజీ ల్యాబ్‌లో యాంటీబాడీస్‌ పనితీరుపై నివేదికలు తయారు


జిల్లాలో కొవిడ్‌ విలయం సృష్టిస్తోంది. వేలాదిమందిని వరుసపెట్టి వైరస్‌ చుట్టుముట్టేస్తోంది. ప్రతిరోజూ వేలల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యేలా చేస్తోం ది. గడిచిన కొన్ని వారాలుగా వరుసగా కొవిడ్‌ కేసుల కలకలం కొనసాగు తూనే ఉంది. వాస్తవానికి వరుసగా వస్తోన్న వేలాది పాజిటివ్‌ కేసులు కట్టడి కాకపో తాయా అని అధికారులు, వైద్యులు ఎదురుచూస్తున్నా జిల్లాలో ఎక్కడా ఆ ఛాయలే కనిపించడం లేదు. పల్లెలు, పట్టణాలు, నగరాలు తేడా లేకుండా ఎక్కడికక్కడ పాజిటివ్‌లు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఒకపక్క అన్ని కొవిడ్‌ క్వారంటైన్‌ కేంద్రాలు, ఐసోలేషన్‌ బెడ్లు ఎక్కడికక్కడ కిక్కిరిసి పోయాయి. దీంతో రోజూ వేలల్లో కొత్తగా వైరస్‌ బారిన పడుతున్న బాధితులను ఎక్కడ ఉంచాలో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు. కాగా జిల్లా లో గడిచిన 24 గంటల్లో 1,351 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


అత్యధికంగా కాకినాడ నగరంలో 326 మందికి కొత్తగా వైరస్‌ నిర్ధారణ అయింది. దీంతో సిటీలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 3,358కి చేరుకున్నాయి. అటు కంటైన్మెంట్‌ జోన్‌లు 54 ఉన్నట్టు అధికారులు వివరించారు. రాజమహేంద్రవరం  నగరంలో గడిచిన 24 గంటల్లో 301 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం పాజిటివ్‌లు 2,239కి చేరాయి. కంటైన్మెంట్‌ జోన్లు 54కి పెరిగాయి. ఇవికాకుండా అమలాపురంలో గడిచిన 24 గంటల్లో 85 మందికి కొవిడ్‌గా తేలింది. తునిలో 64, కరప 52, కాకినాడ రూరల్‌ 49, ప్రత్తిపాడు 32, అంబాజీపేట 20, అనపర్తి 25, ఆత్రేయపురం 26, బిక్కవోలు 15, జగ్గంపేట 16, కిర్లంపూడి 22, కొత్తపల్లి 17, కొత్తపేట 24, మండపేట 27, పిఠాపురం 31, రాజమహేంద్రవరం రూరల్‌ 24, సామర్లకోట 13, ఏలేశ్వరం 16, తొండంగి 10, ఇతర మండలాల్లో మరికొన్ని చొప్పున కొవిడ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. కాగా జిల్లాలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 27,580కి చేరాయి. కొవిడ్‌ మరణాలు 205కి చేరినట్టు ప్రభుత్వం రాష్ట్ర బులిటెన్‌లో ప్రకటించింది. 


ఇన్ఫెక్షన్‌ రేటు ఎంత?

రాష్ట్రంలో అత్యధికంగా జిల్లాలో 27 వేల పాజిటివ్‌ కేసులు నమో దైన నేపథ్యంలో తూర్పులో ప్రజల రోగ నిరోధక వ్యవస్థ ఎలా ఉంది? ప్రజ ల్లో కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ శాతం ఎంత? అనే దానిపై ప్రభుత్వం సర్వే ప్రారంభించింది. అందులో భాగంగా ఆరు బృందాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఒక ల్యాబ్‌ అసిస్టెంట్‌, సూపర్‌వైజర్‌, మెడికల్‌ ఆఫీసర్‌ ఉంటారు. వీరంతా రోజుకు నాలుగు మండ లాల చొప్పున వారం వ్యవధిలో 28 మండలాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ఇంతవరకు కొవిడ్‌ టెస్ట్‌లు చేయించుకోని వ్యక్తులను గుర్తించి రోజుకు 600 మంది నుంచి రక్త నమూనాలు సేకరిస్తారు.


గురువారం నుంచి మొదలైన ఈ సర్వే తొలి రోజు కాకినాడ నగరంలో ప్రారంభించారు. శుక్రవారం రాజమహేంద్ర వరం నగరంలో రక్తనమూనాలు సేకరిస్తారు. అధ్యయనంలో భాగంగా వ్యక్తుల నుంచి రక్త నమూనాలు సేకరించి కొవిడ్‌ వైరస్‌తో పోరాడే విధంగా వీరిలో యాంటీజెన్‌ బాడీస్‌ ఎలా పనిచేస్తున్నాయి? ఇనెక్ఫన్‌ శాతం ఎంత ఉంది? అనేది అధ్య యనం చేయనున్నారు. వారంలో మొత్తం 3,750 మంది నుంచి నమూనాలు సేకరించి గుంటూరులోని ఐజీజీ ల్యాబ్‌లో పరీక్షించనున్నారు. తద్వారా జిల్లా ప్రజల్లో కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌,యాంటిబాడీస్‌ ఎలా ఉన్నాయనేది ఓ అంచనాకు ప్రభుత్వం రానుంది. అటు ఈ తరహా సర్వే తూర్పుతోపాటు మరో మూడు జిల్లాల్లో గురువారం నుంచి ప్రారంభమైంది.

Updated Date - 2020-08-07T11:32:18+05:30 IST