ఈఎస్‌ఐలో న్యాయశాఖ ఉద్యోగులకు కొవిడ్‌ వైద్యం

ABN , First Publish Date - 2020-07-12T11:11:05+05:30 IST

తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో న్యాయశాఖలో పనిచేసే వారికి కొవిడ్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు జేసీ

ఈఎస్‌ఐలో న్యాయశాఖ ఉద్యోగులకు కొవిడ్‌ వైద్యం

15కల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని జేసీ ఆదేశాలు


తిరుపతి (వైద్యం), జూలై 11: తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో న్యాయశాఖలో పనిచేసే వారికి కొవిడ్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు జేసీ వీరబ్రహ్మయ్య తెలిపారు. ఆర్సీ రోడ్డులోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో చేపడుతున్న ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. సూప రింటెండెంట్‌ డాక్టర్‌ బాలశంకర్‌ రెడ్డి, వైద్యాధికా రులతో సమీక్షించారు. ప్రత్యేకమైన డాక్టర్లతో వైద్యసేవలు అందించేందుకు ఐఎంఏ ముందుకు వచ్చిందన్నారు. ఈఎస్‌ఐలో ఆక్సిజన్‌ సిలిండర్లు, ల్యాబరేటరీ వంటి మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు.


ఈ నెల 15వ తేది నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి, ఆస్పత్రిని అందుబాటు లోకి తీసుకురావాలన్నారు. ప్రాథ మికంగా, సాధారణ, మధ్యస్థాయి కొవిడ్‌ కేసులకు వైద్యం అందిం చాలని, అత్యవసరమైన కేసులను స్విమ్స్‌కు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పెంచలయ్య, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సరళమ్మ, ఈఎస్‌ఐ కొవిడ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ రమణారెడ్డి, రుయా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భారతి, ఈఎస్‌ఐ ఆర్‌ఎంవో డాక్టర్‌  కల్పలత, ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్‌ కృష్ణప్రశాంతి, శ్రీహరిరావు, మదన్‌,యుగంధర్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-07-12T11:11:05+05:30 IST