మతం మరిచిన మానవత్వం

ABN , First Publish Date - 2021-05-07T16:43:11+05:30 IST

కరోనాతో మృతిచెందితే కు టుంబ సభ్యులే దగ్గరకు రాలేని దుస్థితి. కానీ మతం మరచి మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఆ ముస్లిం యువకులు. బళ్లారి జిల్లా సండూరు తాలూకా ముస్లిం యు

మతం మరిచిన మానవత్వం

        - కరోనా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నముస్లిం యువకులు

        - సర్వధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వడంపై  పలువురి ప్రశంసలు



నలుగురితో మంచిగా ఉండాలి.. మనం పోతే నలుగురు  ఏడవాలి..  మోయడానికి నలుగురు ఉండాలి.. 

మన పెద్దలు ఎప్పుడూ ఇవే మాటలనడం వింటుంటాం..కానీ మహమ్మారి కరోనా ప్రపంచాన్ని కమ్మేసిన వేళ నా అన్నవాళ్లే దూర మవుతున్నారు.. కడుపున పుట్టిన వాళ్లే కడ చూపుకు రావడానికి జంకు తున్నారు...ఇక కడతేరాక కాటికి మోసే దెవరు.. శాస్త్రోక్తంగా కర్మ కాండలు నిర్వహించేదెవరు.. అలాంటి వేళ ఏ బంధుత్వం లేకున్నా కన్నుమూసిన క్షణం నుంచి కాటికి మోసేవరకు.. తామున్నామంటూ మృతదేహాలను స్వయంగా మోస్తూ కర్మకాండలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారా యువకులు.



బళ్లారి(కర్ణాటక): కరోనాతో మృతిచెందితే కుటుంబ సభ్యులే దగ్గరకు రాలేని దుస్థితి. కానీ మతం మరచి మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఆ ముస్లిం యువకులు. బళ్లారి జిల్లా సండూరు తాలూకా ముస్లిం యువకుల బృందం ఒకటి కరోనా ద్వారా మృతి చెందిన ఇద్దరు మ హిళల అంత్య సంస్కారాన్ని చేయడం ద్వారా మానవీయతను చాటుకున్నారు కరోనాతో మృతి చెందిన తాలూకా పరిధిలోని తోరణగల్లు,  సుబ్రయనహళ్ళికి చెందిన ఇద్దరు మహిళల శవసంస్కారం తొలిసారి నిర్వహించారు. ఆరోజు నుంచి వారి సేవలు కొనసాగుతూనే ఉన్నాయి... గత సంవత్సరం కరోనా సమయంలో భోజనం, ఉపహారం, కొబ్బరి నీళ్లు అందజేయడంతో పాటు కరోనా సోకిన... మృతి చెందిన ముస్లిం సముదాయ వర్గానికి చెందిన ఈ యువకులు అంత్య సంస్కారాన్ని గావించారు. అయితే ఈ సారి ఆ జాతి... ఈ జాతి అనే బేధభావం లేకుండా సర్వధర్మాలకు చెందిన వారికి శవసంస్కారాలు చేసేందుకు ముందుకు వచ్చిన యువకుల బృందాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. యువకుల్లో యశంతవంత నగర్‌కు చెందిన సై యద్‌ హుసేన్‌పీరా, దొడ్డమ ని, హిరాళ్‌కు కేకే మెబూబ్‌ భాష, కేకే దాదా, ఖలందర్‌, నిజాముద్దీన్‌, వైటిజి మెడికల్‌ షాప్‌ సుబాన్‌, న్యాయవాది ఉమర్‌ ఫారూక్‌, కరాటే శిక్షకులు ఇస్మాయిల్‌ మెకానిక్‌, సుబాన్‌, ఇఫ్తికా, నిసార్‌ అహ్మద్‌, యూసఫ్‌, బి.జిలాని భాష, కె. శర్మాస్‌ అ బృందంగా ఏర్పడి శవసంస్కారాలు నిర్వహిస్తున్నారు. యువకుల ఉద్దేశ్యాన్ని స్థానిక తహసీల్దారు, ఆరోగ్య, పోలీసు ఇతర శాఖల అధికారులకు తెలిపి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఇద్దరు మహిళల అంత్యక్రియలతో వీరి మహత్తర కార్యం ప్రారంభమయ్యింది. ఆరోజు నుంచి సండూరు తాలూకా పరిధిలో ఎవరు  కరోనాతో మృతి చెందినా.. వారి అంత్యసంస్కారాలు నిర్వహిస్తూనే ఉన్నారు. తగిన సౌకర్యాలు కల్పిస్తే మరిన్ని సేవలందిస్తామని అంటున్నారు.

Updated Date - 2021-05-07T16:43:11+05:30 IST