Abn logo
Sep 21 2021 @ 12:17PM

కరోనాతో మృతిచెందిన వారి కుటుంబాలకు చేయూత

                 - రూ.5 లక్షలు అందించిన నందన గ్రూప్‌ హోటళ్ల అధినేత రవిచందర్‌ 


బెంగళూరు: కొవిడ్‌వేళ తమ గ్రూప్‌ హోటళ్లలో పనిచేసే సిబ్బంది మొత్తానికి రూ.5 లక్షల బీమా అందిస్తానని ప్రకటించిన నందన గ్రూప్‌ హోటళ్ల అధినేత డాక్టర్‌ రవిచందర్‌ మాట నిలబెట్టుకున్నారు. బెంగళూరు కోరమంగళ సెంట్రల్‌ కిచన్‌లో స్టోర్‌ మేనేజర్‌గా పనిచేస్తూ మూడు నెలల క్రితం కొవిడ్‌కు బలైన వెంకటరమణ (40) కుటుంబానికి బీమా మొత్తం, సిబ్బంది సంక్షేమ నిధి నుంచి కలిపి రూ.5 లక్షల చెక్కును సోమవారం అందజేశారు. వెంకటరమణ భార్య సాయమ్మ ఈ మే రకు చెక్కును అందుకొంది. వెంకటరమణది ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా, ఒంగోలు సమీపంలోని గిద్దలూరు. ఆయన చాలాకాలంగా నందన సెంట్రల్‌ కిచెన్‌లో పనిచేస్తున్నాడు. సాయమ్మకు ఇద్దరు బిడ్డలు ఉన్నారని వీరిలో ఒక కుమారుడు రాత్రిపూట కళాశాలలో చదువుకునే పక్షంలో అతడికి పగటిపూట తమ హోటల్‌లో పనిచేసే అవకాశం కల్పిస్తానని డాక్టర్‌ రవిచందర్‌ భరోసా ఇచ్చారు. ఈ సాయం తమ జీవితానికి ఎంతో గొప్పదని, ఈ మొత్తంతో ఓ ఇంటిని లీజుకు తీసుకొని కూలీనాలి చేసైనా సరే బిడ్డను చదివిస్తానని సా యమ్మ పేర్కొంది. డాక్టర్‌ రవిచందర్‌ ఔదార్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.