కోవిడ్ వల్ల అనాథలైన మహిళలకు యోగి ప్రభుత్వం ఆర్థిక సాయం?

ABN , First Publish Date - 2021-08-04T21:39:48+05:30 IST

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్

కోవిడ్ వల్ల అనాథలైన మహిళలకు యోగి ప్రభుత్వం ఆర్థిక సాయం?

లక్నో : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ వల్ల అనాథలైన మహిళలకు ఆర్థిక సాయం చేయడంపై దృష్టి పెట్టింది. ఒక్కొక్క అనాథ మహిళకు నెలకు రూ.2,000 చొప్పున అందజేయబోతోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేసింది. ఈ వివరాలను ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారులు జాతీయ మీడియాకు బుధవారం తెలిపారు. 


త్వరలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ మార్గదర్శకాలపై చర్చించి, అనుమతి పొందిన వెంటనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. 2020 మార్చి నుంచి అనాథలుగా మారిన మహిళల జాబితాను సమర్పించాలని మహిళా సంక్షేమ శాఖను యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. అనాథ మహిళలకు ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని కూడా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత రేషన్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన క్రింద ఇల్లు, ముఖ్యమంత్రి జన ఆరోగ్య యోజన క్రింద మెడికల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వంటివాటిని కూడా వీరికి అందజేయాలని నిర్ణయించింది. 



Updated Date - 2021-08-04T21:39:48+05:30 IST