అగ్రరాజ్యంలో కరోనా కలకలం.. గంటకు 34 మరణాలు

ABN , First Publish Date - 2021-08-21T14:17:05+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. గురువారం ఒక్క రోజే లక్షన్నర మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా అమెరికాలో లక్షపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా

అగ్రరాజ్యంలో కరోనా కలకలం.. గంటకు 34 మరణాలు

జపాన్‌లో ఎమర్జెన్సీ, శ్రీలంకలో లాక్‌డౌన్‌

న్యూయార్క్‌, ఆగస్టు 20: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. గురువారం ఒక్క రోజే లక్షన్నర మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కొన్ని రోజులుగా అమెరికాలో లక్షపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మరింత పెరిగాయి. దీనికితగ్గట్లే మరణాలు సైతం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల్లో 5,800 మంది మృతి చెందారు. రోజుకు సగటున 800 మందిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే గంటకు 34 మంది. కాగా, మొత్తం 50 రాష్ట్రాలకు 42 రాష్ట్రాల్లో మరణాలు పెరగుతున్నాయి.


కాగా, కరోనా ఉధృతితో జపాన్‌లోని చాలా ప్రాంతాల్లో సెప్టెంబరు 12 వరకు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. మరోవైపు శ్రీలంక మొత్తం లాక్‌డౌన్‌ విధించారు. ఇక ఆస్ట్రేలియాలోని సిడ్నీలో లాక్‌డౌన్‌ సెప్టెంబరు మాసాంతం వరకు పొడిగించారు.


Updated Date - 2021-08-21T14:17:05+05:30 IST