కోవిడ్ మానవ శరీరంలో ఇంత విధ్వంసం సృష్టిస్తుందా?.. ఈ X-ray ద్వారా షాకింగ్ విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2021-11-08T15:14:54+05:30 IST

కోవిడ్ 19 దాత నుంచి పొందిన మానవ అవయవాలతో పాటు లంగ్స్‌ను స్కాన్ చేయడానికి UCL, యూరోపియన్ సింక్రోట్రోన్ రీసెర్చ్ ఫెసిలిటీ (ESRF) శాస్త్రవేత్తలు

కోవిడ్ మానవ శరీరంలో ఇంత విధ్వంసం సృష్టిస్తుందా?.. ఈ X-ray ద్వారా షాకింగ్ విషయాలు వెలుగులోకి..

న్యూఢిల్లీ: కోవిడ్ 19 దాత నుంచి పొందిన మానవ అవయవాలతో పాటు లంగ్స్‌ను స్కాన్ చేయడానికి UCL, యూరోపియన్ సింక్రోట్రోన్ రీసెర్చ్ ఫెసిలిటీ (ESRF) శాస్త్రవేత్తలు హైరార్కికల్ ఫేజ్-కాంట్రాస్ట్ టోమోగ్రఫీ (HiP-CT) అనే కొత్త విప్లవాత్మక ఇమేజింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. HiP-CT స్కేల్‌ల శ్రేణిలో 3D మ్యాపింగ్‌ చేయడం చేస్తూ.. వైద్యులు అవయవాలన్నింటినీ మునుపెన్నడూ లేని విధంగా ఇమేజింగ్ చేసి.. ఆపై సెల్యులార్ లెవల్‌కు జూమ్ చేసే అవకాశాన్ని ఈ టెక్నాలజీ కల్పిస్తుంది.


ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్‌లో యూరోపియన్ సింక్రోట్రోన్ (పార్టికల్ యాక్సిలరేటర్) ద్వారా సరఫరా చేయబడిన ఎక్స్-రేస్‌ను ఈ టెక్నిక్ వినియోగించుకుంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఆసుపత్రిలో వినియోగించే ఎక్స్‌రేతో పోలిస్తే 100 బిలియన్ రెట్ల క్లారిటీని పొందవచ్చు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. పరిశోధకులు చెక్కుచెదరకుండా ఉన్న మానవ ఊపిరితిత్తులలో ఐదు మైక్రాన్ల వ్యాసం (వెంట్రుక వ్యాసంలో పదవ వంతు) ఉన్న రక్తనాళాలను సైతం ఈ టెక్నాలజీ ద్వారా వీక్షించవచ్చు. క్లినికల్ CT స్కాన్ వచ్చేసి కేవలం 100 రెట్లు పెద్ద, 1mm వ్యాసం కలిగిన రక్త నాళాలను మాత్రమే పరిష్కరిస్తుంది. 


HiP-CTని ఉపయోగించి, జర్మనీ, ఫ్రాన్స్‌లోని వైద్యుల సహా పరిశోధనా బృందం, రక్తాన్ని ఆక్సిజన్ చేసే కేశనాళికలు, ఊపిరితిత్తుల కణజాలానికి ఆహారం ఇచ్చే రెండు వేర్వేరు వ్యవస్థల మధ్య కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ రక్తాన్ని ఎంత తీవ్రంగా 'షంట్' చేస్తుందనేది తెలుకోగలిగింది. అటువంటి క్రాస్-లింకింగ్ రోగిక్క రక్తాన్ని సరిగ్గా ఆక్సిజనేషన్ చేయకుండా ఆపుతుంది. అయితే దీనిని వైద్యులు గతంలోనే ఊహించారు కానీ నిరూపించలేకపోయారు. 


థొరాసిక్ పాథాలజీ ప్రొఫెసర్ (హన్నోవర్ మెడికల్ స్కూల్, జర్మనీ) డానీ జోనిగ్ మాట్లాడుతూ, “కోవిడ్ 19 న్యుమోనియా ప్రభావిత ఊపిరితిత్తులలోని HiP-CT మల్టీస్కేల్ ఇమేజింగ్‌తో మా మాలిక్యులర్ పద్ధతులను కలపడం ద్వారా రక్త నాళాల మధ్య ఎలా షంటింగ్ అవుతుందో మాకు కొత్త అవగాహన వచ్చింది. ఊపిరితిత్తుల యొక్క రెండు వాస్కులర్ వ్యవస్థలు కోవిడ్-19 గాయపడిన ఊపిరితిత్తులలో సంభవిస్తాయి. అది మన ప్రసరణ వ్యవస్థలో ఆక్సిజన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది" అని పేర్కొన్నారు. 



Updated Date - 2021-11-08T15:14:54+05:30 IST